22


అహంకార స్వరూపము

       హిరణ్య గర్భునితో కూడి విక్షేపశక్తి తమోగుణ సహితమై, అహంకారమనే స్థూలరూపశక్తిగా మారిపోయాడు. ఈ అహంకారము మహతత్త్వమునకు అభిమానియగుట వలన మహదహంకారము అని ప్రసిద్ధము.

       అందులోగల ప్రతిబింబము సర్వ జగత్పాలకుడైన విష్ణువు అనెడి ప్రధాన పురుషుడైనాడు. అందువలన హిరణ్య గర్భుడే విష్ణువు. అవతారములన్నీ ఈ హిరణ్య గర్భుడు అనే ప్రథమాత్మనుండియే వచ్చుచున్నవి. అనగా విష్ణువే అవతరించుచున్నాడు.